వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న శర్వానంద్, నిత్యా మీనన్ ల చిత్రం

Sharwanand-Nithya-Menen
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న శర్వానంద్, నిత్యామీనన్ లు తమ కెరీర్ లో రెండోసారి జతకట్టనున్నారు. ఈ సినిమా హైదరాబాద్ లో లాంచనంగా మొదలైంది.

ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో కొన్ని ముఖ్యసన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కె.ఏ వల్లభ నిర్మాత. కె.ఎస్ రామారావు సమర్పకుడు. ఆయన మాట్లాడుతూ “నా కెరీర్ లో చాలా స్క్రిప్ట్ లను విన్నాను కానీ ఇటువంటి కధలను ఎప్పుడూ వినలేదు. మా బ్యానర్ పై ఇటువంటి మంచి సినిమా రావడం ఆనందంగా వుంది” అని అన్నారు

గోపీ సుందర్ సంగీతదర్శకుడు. వి.ఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్. ఆగష్టులో ఈ చిత్రం మనముందుకు రానుంది

Exit mobile version