శర్వానంద్ ‘ఓనమాలు’ దర్శకుడు క్రాంతి మాధవ్ తో జతకట్టనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఇద్దరు చర్చలు జరిపారు . ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె. ఎస్ రామ రావు ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని నిర్మించనున్నారు.
సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ జనవరి 2014 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘మళ్ళి మళ్ళి ఇది రాని రోజు ‘ అనే పేరు పరిశీలనలో ఉంచారు. కాని ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించలేదు. నిత్య మీనన్ ఈ చిత్రం లో కధానాయిక గా శర్వానంద్ తో జత కట్టనుందని సమాచారం. వీరిద్దరూ చరణ్ ‘ఏమిటో ఈ మాయ ‘ లో నటించగా ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు.
శర్వానంద్ ప్రస్తుతం ‘రన్ రాజ రన్’ అనే ఒక క్రైమ్ కామెడీ లో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో శర్వానంద్ దొంగ పాత్ర పోషిస్తున్నాడని వినికిడి.