యంగ్ హీరో ఆది, నిషా అగర్వాల్, భాను రుపారెల్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘సుకుమారుడు’ సినిమా మే 10న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొని యు/ఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాకి ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్. జి డైరెక్టర్. కెవివి సత్యనారాయణ సమర్పణలో వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఆది మాట్లాడుతూ ‘ సుకుమారుడు కామెడీ, లవ్, సెంటిమెంట్ కలగలిపిన ఎంటర్టైనర్. సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారద గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో శారద గారికి చాలా మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాతో ఆమె మీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారని’ అన్నాడు.
అశోక్ మాట్లాడుతూ ‘ ఆది ఈ సినిమాలో అద్భుతమైన నటనని కనబరిచాడు. సినిమా ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలా నవ్విస్తుంది. కామెడీ ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే కృష్ణ – శారదల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయని’ అన్నాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.