అడ్డా సినిమాలో మెరిసిన షన్వి తెలుగులో ఒక పెద్ధ ప్రొజెక్ట్ ను సొంతం చేసుకుంది. ఆమె రామ్ గోపాల్ వర్మ సినిమాలో మంచు విష్ణు సరసన కనిపించనుంది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది
సినిమా మొదలుకాకముందు దీనిలో రెజీనా నాయిక అన్నారు. కానీ హీరోయిన్ సెట్ అవ్వకుండా మొదలుపెట్టిన ఈ సినిమాలో ఈ షన్వి భామానే తీసుకున్నారు. చాలాకాలం తరువాత రాము యాక్షన్ కామెడీ తీస్తున్నాడు గనుక మోహన్ బాబు, విష్ణులు చాలా ఆసక్తితో కధను విన్నారు
మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతం మంచు వారిఫ్యామిలీ ఎంటెర్టైనర్ పాండవులు పాండవులు తుమ్మెద థియేటర్లలో విజయవంతంగా నడుస్తుంది