క్లైమాక్స్ సీక్వెన్స్ పూర్తి చేసిన శంకర్

క్లైమాక్స్ సీక్వెన్స్ పూర్తి చేసిన శంకర్

Published on Jan 14, 2014 11:00 PM IST

Manoharudu
సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ చేస్తున్న ‘ఐ’ సినిమా చివరి దశకు చేరుకుంది. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సురేష్ గోపి, ఉపేన్ పటేల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఐ సినిమా తెలుగులో ‘మనోహరుడు’గా విడుదల కానుంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం శంకర్ ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ని పూర్తి చేసాడు. ఇటీవలే విక్రమ్, ఉపేన్ పటేల్ పై వైజాగ్, ఒరిస్సా లోని కొన్ని ప్రాంతాల్లో షూట్ చేసారు. దీనితో 90% సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మొదటి సారి శంకర్ న్యూజీ ల్యాండ్ కి సంబందించిన మేకప్ స్పెషలిస్ట్ లు వేట వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడు.

ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు