చివరి దశకు చేరుకున్న శంకర్ 100 కోట్ల సినిమా

tamil-movies-shankar-i-movi
హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా చేస్తున్న సినిమా ‘ఐ’. ఈ సినిమాని ‘మనోహరుడు’గా తెలుగులోకి అనువదిస్తున్నారు. సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుమారు 17 భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా విశేషాలను గురించి శంకర్ చెబుతూ ‘ మనోహరుడు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమా షూటింగ్ కి ఎక్కువ సమయం తీసుకుంటున్నాం అందులో విక్రమ్ మేకప్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాం. బాగా రిచ్ గా వస్తున్న ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో బాగా వైవిధ్యంగా ఉండేలా తెరక్కిస్తున్నాం. విక్రమ్ ని ఎందుకు గొప్ప నటుడు అంటారనేది ఈ సినిమా ద్వారా మరోసారి రుజువవుతుందని’ అన్నారు.

ఈ సినిమాలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి పిసి శ్రీరాం సినిమాటోగ్రాఫర్. ఈ భారీ బడ్జెట్ మూవీని ఆస్కార్ ఫిల్మ్స్ బ్యానర్ పై రవిచంద్రన్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version