‘మదరాసిపట్టినమ్’ సినిమా ద్వారా బాలీవుడ్ మరియు టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అమీ జాక్సన్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’లో హీరోయిన్ గా కనిపిస్తుంది. అంతేకాక శంకర్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం ‘మనోహరుడు’ షూటింగ్ లో కూడా నటిస్తుంది
ఈ సినిమాలో తను ‘మానియామ్మాళ్’ పేరులో పడ్డతీగల బ్రాహ్మణకుటుంబంలో పుట్టిన అమ్మాయిగా నటిస్తుంది. “ఈ పాత్రలో నటించాక ఇండియాలో ఎందుకు పుట్టలేదా అని బాధపడ్డాను. నాకు ఈ జీవితం నచ్చింది. శంకర్ గారు నా నడకను, నా నడవడికను మార్చేశారు. ఆయన నన్ను మార్చిన విధానాన్ని శిల నుంచి శిల్పాన్ని చెక్కిన విధానంగా వర్ణించవచ్చు. ఈ భారీ ప్రొజెక్ట్ లో నేను కూడా పాలుపంచుకోవడం ఆనందకరం,. అందుకే మరే ఇతర సినిమాలు అంగీకరించలేదు” అని తెలిపింది
ప్రస్తుతం ఈ ‘మనోహరుడు’ సినిమా ముగింపుదశలోవుంది. ఈ సినిమాలో విక్రమ్ హీరో. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు