విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాడో’. ఈ సినిమా ఆడియోని మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు ఖరారైంది. ఆడియో మరియు సినిమా రిలీజ్ తేదీలను త్వరలోనే తెలియజేయనున్నారు. వెంకీ సరసన మొదటిసారి ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ డైరెక్టర్. వెంకీ డాన్ అవతారంలో చాలా స్టైలిష్ గా కనిపించనున్న ఈ సినిమాకి ప్రముఖ కథా రచయితలు కోనా వెంకట్ – గోపి మోహన్ కథని అందించారు. శ్రీకాంత్ మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసిన ఈ సినిమాని యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు.