అందమైన ప్రేమ కథగా ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’

అందమైన ప్రేమ కథగా ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’

Published on May 23, 2012 8:24 AM IST


నాని, సమంతా జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ప్రేమ కథ త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా గౌతమ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సున్నితమైన ప్రేమ కథగా తెరకెక్కుతుంది. టీనేజ్ సమయం నుండి వారి మధ్య చిగురించిన ప్రేమ ఎలా బలపడిందో చూపిస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీతం కీలక పాత్ర పోషించనుంది. ఇసయజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్న పాటలన్నీ అధ్బుతంగా వచ్చాయని సమాచారం. 7 ఫుల్ సాంగ్స్, 2 బిట్ సాంగ్స్ తెరకెక్కిన ఈ చిత్ర ఆల్బం జూన్ మొదటి వారంలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆల్బం లోని అన్ని పాటలకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. 3 పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు