సీనియర్ నటి ఇక లేరు !

ప్రముఖ కన్నడ సినీనటి శాంతమ్మ ఇకలేరు. ఆమె వయసు 94 సంవత్సరాలు, వయసు మీద పడటంతో శాంతమ్మ గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడంతో ఆమె నిన్న రాత్రి కన్నుమూశారు. ఆమెను మార్చి నెలలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా ఆమె కోలుకోలేదు.

ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించారు. కన్నడ పరిశ్రమలో సీనియర్ నటిగా శాంతమ్మ దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1956 నుంచి పలు కన్నడ సినిమాల్లో నటించిన శాంతమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లున్నారు. పలువురు కన్నడ సినీనటులు శాంతమ్మకు నివాళులు అర్పించారు. 123తెలుగు.కామ్ తరఫున శాంతమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Exit mobile version