దర్శకుడు సెల్వ రాఘవన్ నూతన ప్రతిభను పరిశ్రమలోకి తీసుకొచ్చేందుకు కొత్త నిర్మాణ సంస్థ స్థాపించారు. “ఆం ప్రొడక్షన్స్” అనే పేరుతో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు అధినేత గా సిద్దార్థ్ రావు ని నియమించారు అయన ప్లాన్స్ గురించి చెప్తూ “అం ప్రొడక్షన్స్ కి అధినేతగా సిద్దార్థ్ రావు ఉండటం అనంధమయిన విషయం. రాబోయే రెండు సంవత్సరాలలో 7 చిత్రాలను నిర్మించాలన్నది మా సంకల్పం కొత్తవారిని ప్రోత్సహించాలనేది మా అజెండా నటులు/దర్శకులు/రచయితలు/సంగీత దర్శకులు/స్క్రీన్ప్లే రైటర్స్/గాయకులూ మొధలగు వారు.ఇలా పలువురిని పరిచయం చెయ్యాలని మా సంకల్పం వీరు aumproduction@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు” అని అన్నారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన జరిపిన ఒక గంటలోనే దేశంలో పలు ప్రదేశాల నుండి ఆయనకు 500 పైగా ఈ మెయిల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఆర్య మరియు అనుష్క ప్రధాన పాత్రలలో రానున్న “బృందావనంలో నందకుమారుడు” చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉన్నారు. ఈ చిత్రం తరువాత రానా ప్రధాన పాత్రలో ఒక ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.