మళ్లీ ప్రేమ పాఠాలు చెప్పనున్న శేఖర్ కమ్ముల..?

మళ్లీ ప్రేమ పాఠాలు చెప్పనున్న శేఖర్ కమ్ముల..?

Published on Jul 20, 2025 9:00 AM IST

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల రీసెంట్‌గా ‘కుబేర’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇక ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు కూడా వచ్చేసింది.

అయితే, ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నానితో చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, నానికి ఉన్న లైనప్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పడుతుంది. దీని కారణంగా శేఖర్ కమ్ముల ఇప్పుడు ఓ లవ్ స్టోరీని సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఈ కథను ఇప్పటికే ఆయన ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడట. ఈ సినిమాతో పాటు నాని చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా చేయాలని ఆయన భావిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే శేఖర్ కమ్ముల నుంచి ఓ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు