విద్యాబాలన్ కంటే నయనతార పెర్ఫార్మన్స్ బాగుంటుంది – శేఖర్ కమ్ముల

Sekhar-Kammula-nayana-thara
సున్నితమైన కథాంశాలతో సినిమాలు చేసి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటి సారిగా రీమేక్ చేస్తున్న మూవీ ‘అనామిక’. తెలుగు తమిళంలో ఒకేసారి చిత్రీకరించిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల నయనతార పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతూ ‘నయనతార బాగా టాలెంట్ మరియు ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఇప్పటికే కహాని చూసిన వారు అనామిక చూసినప్పుడు నయనతార పెర్ఫార్మన్స్ ముందు విద్యా బాలన్ పెర్ఫార్మన్స్ పెద్దగా లేదని మీరే చెప్తారు. ఎందుకంటే నయనతార చాలా బాగా నటించిందని’ అన్నాడు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఎండేమోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ కలిసి నిర్మించారు. హర్షవర్ధన్ రాణే, వైభవ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version