డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నయనతార కలిసి పనిచేస్తున్న సినిమా ‘అనామిక’. బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాదించిన ‘కహాని’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో కొన్ని మార్పులు చేశారని సమాచారం. ఎండేమోల్ ఇండియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ‘కహాని’ సినిమాతో విద్య బాలన్ కి మంచి గుర్తింపు వచ్చింది. మరి నయనతారకు ఈ ‘అనామిక’ సినిమా అలాంటి గుర్తింపును తీసుకొస్తుందా? లేదా? అనేది తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.