చైత్ర ప్రాజెక్ట్ విషయంలో షాక్ అయిన శేఖర్ కమ్ముల

sekhar-kammula
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా ఎంతో యాక్టివ్ గా ‘ఐ కేర్ ఐ రియాక్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ చైత్ర’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్, మరి కొంతమంది ఐటి ప్రొఫెషనల్స్ కూడా పాల్గొంటున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కఠినమైన చర్యలు తీసుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారు.

ఇటీవలే శేఖర్ కమ్ముల, అతని టీం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి వారి మానిఫెస్టోలో మహిళా భద్రత, సాధికారతని జత చేయమని కోరారు. వెంటనే దానికి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపాడు. ‘అంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు మా రిక్వెస్ట్ ని అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. మేము కలిసి కొద్ది రోజులకే ఆయన నుండి మాకు రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం పై మేము అందరి రాజకీయ పార్టీలను కలవాలనుకుంటున్నాం. మామూలు కామన్ మాన్ కోరిక ఒక గవర్నమెంట్ పాలసీగా మార్చడం చాలా ఆనందంగా ఉందని’ శేఖర్ కమ్ముల అన్నాడు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘అనామిక’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version