మన టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన ఎన్నో గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రాల్లో రానా దగ్గుబాటితో చేసిన పొలిటికల్ డ్రామా చిత్రం “లీడర్” కూడా ఒకటి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న ఈ సినిమా అప్పట్లో అంతగా రాణించక పోయినప్పటికీ దీనికి పార్ట్ 2 పట్ల మంచి హైప్ ఇప్పుడు ఉంది. ఇక ఈ సీక్వెల్ పై శేఖర్ కమ్ముల నుంచి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ క్లారిటీ బయటకి వచ్చింది.
లీడర్ 2 కోసం తాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను అని కథ కూడా క్లారిటీ ఉంది కానీ లీడర్ సినిమా చేసిన సమయానికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. జనం కూడా మారారు, థింకింగ్ మారిపోయింది సో దానిని కరెక్ట్ గా పట్టుకోవాలని అంటున్నారు. దీనితో లీడర్ 2 స్కోప్ మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సిందే. ఇక ప్రస్తుతం తన కుబేర రిలీజ్ కి వస్తుంది.