ఈ సంక్రాంతి సీజన్ ‘సీతమ్మ వాకిట్లో … ఎంత వరకు కలిసి వచ్చింది!

ఈ సంక్రాంతి సీజన్ ‘సీతమ్మ వాకిట్లో … ఎంత వరకు కలిసి వచ్చింది!

Published on Jan 22, 2013 8:17 AM IST

SVSC New Posters (3)
ఈ సంవత్సరం సంక్రాంతి రేసులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విడుదలైంది. సంక్రాంతి సీజన్లో విడుదలయ్యే కుటుంబ కథా చిత్రాలకి అంతగా ఆదరణ ఉండదనే అపవాదు ఉండేది. ఈ సంక్రాంతి సీజన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఈ చిత్రం కలెక్షన్లలో ముందంజలో ఉండటం విశేషం. చాలా కాలం తరువాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం, వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, ప్రకాష్ రాజ్ నటన, అశ్లీలతకి ఎక్కడా తావివ్వకుండా కుటుంబం అంతా కలిసి చూడతగ్గ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు. అమెరికా, నైజాం లాంటి చాలా ఏరియాల్లో మొదటి వారం అల్ టైం రికార్డులు కొట్టిన ఈ సినిమా టాప్ 3 సినిమాల్లో నిలవడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు