క్రైమ్ థ్రిల్లర్ మరియు అండర్ వరల్డ్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మకి మంచి పేరుంది. కానీ ఈ మధ్య ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడంలో మాత్రం వర్మ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఈ విలక్షణ దర్శకుడు తాజాగా తెరకెక్కించిన ‘సత్య 2’ త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ఈ రోజు సాయంత్రం వర్మ ఇద్దరు మనుషుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వల్ల వర్మకి సెక్యూరిటీ సమస్య వచ్చింది.
రామ్ గోపాల్ వర్మ ముంబై పోలీస్ డిపార్ట్ మెంట్ కి తనకి వచ్చిన ఫోన్ కాల్స్ గురించి చెప్పి తనకి సెక్యూరిటీ ఇవ్వమని వారిని కోరాడు. ‘నేను చెప్పిన కాల్స్ గురించి పట్టించుకోని చివరికి ముంబై పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు. ఈ కాల్స్ లో చాలా ముఖ్యమైన విషయాల ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల అది నేను చెప్పలేను. అలాగే సత్య 2 గురించి అయితే కాదని’ వర్మ ట్వీట్ చేసాడు.
అసలు వర్మని టార్గెట్ చేసింది ఎవరు? వర్మ సత్య 2 విషయంలో అండర్ వరల్డ్ నుండి సమస్యను ఎదుర్కొంటున్నాడా? ఈ ప్రశ్నలకి ప్రస్తుతానికైతే సమాధానాలు లేవు. వర్మ ఎలాంటి ఇబ్బందుల్లో పడకుండా క్షేమంగా ఉండాలని కోరుకుందాం..