మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు కింగ్ నాగార్జున హీరోగా మాత్రమే కాకుండా ఇపుడు మరిన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ళు నుంచి కింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ రీరిలీజ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “శివ” అని చెప్పాలి. ఇండియన్ సినిమా దగ్గర ఒక ట్రెండ్ సెట్టింగ్ చిత్రంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ ఐకానిక్ ప్రాజెక్ట్ రీరిలీజ్ కోసం ఎప్పుడు నుంచో మంచి ఆసక్తి నెలకొంది.
త్వరలో అంటూ ఊరిస్తూ వచ్చారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. కానీ ఫైనల్ గా నేడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా మేకర్స్ అవైటెడ్ శివ రీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. దీనితో ఈ చిత్రం ఈ నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ కి వస్తున్నట్టుగా ఖరారు చేశారు. మరి రీరిలీజ్ లలో శివ ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అమల హీరోయిన్ గా నటించగా రఘువరన్ విలన్ గా నటించారు. అలాగే మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.