సిద్ధమైన సెకండ్ హ్యాండ్ ఫస్ట్ కాపీ

సిద్ధమైన సెకండ్ హ్యాండ్ ఫస్ట్ కాపీ

Published on Jul 25, 2013 3:50 AM IST

Second-Hand
‘సెకండ్ హ్యాండ్’ సినిమా మొదటి టీజర్ ద్వారా ప్రేక్షకులనుండి మంచి స్పందనను సంపాదించుకుంది. ఈ సినిమాను ప్రముఖ రచయిత బి.వి.ఎస్ రవి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమా యొక్క మొదటి కాపీ ఇప్పటికే సిద్ధమయింది.అది బి.వి.ఎస్ రవికి నచ్చిందని సమాచారం. కిషోర్ తిరుమల దర్శకుడు. ధన్య బాలకృష్ణన్, సుధీర్ వర్మ, కిరీటి, అనూజ్ రామ్ మరియు విష్ణు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. రవి చంద్ర సంగీతాన్ని అందించారు. అవనీంద్ర కెమెరా భాధ్యతలను చేపట్టాడు. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.

చిన్న చిన్న గొడవలతో, కయ్యాలతో సాగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ‘సెకండ్ హ్యాండ్’ రూపుదిద్దుకుంటుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు