సాయి రామ్ శంకర్ చెక్కు చెదరని సంకల్పంతో ఒక పెద్ద హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తన అన్న సక్సస్ ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని నీడల అనుసరిస్తూ నెమ్మదిగా విజయన్ని సాదిస్తున్నాడనికి చూస్తున్నాడు. ఈ టాలెంటెడ్ నటుడు మాట్లాడుతూ విజయాన్ని ఎలా సాదించాలనే దానిని నేను నెమ్మదిగా, ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. అలాగే హార్డ్ వర్క్ చేస్తూ తరువాత స్థానాలకు వెళ్తున్నాను అని అన్నాడు. ఈ మద్య జరిగిన ఇంటర్వ్యూ లో సాయి మాట్లాడుతూ తనకున్న గొప్ప లక్ష్యం గురించి చెప్పడంజరిగింది. ‘
ఒక పెద్ద హిట్ ను సాదించాలని నా కల. నేను దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తాను. నేను చేసిన హార్డ్ వర్క్ కు త్వరలో ఫలితం వస్తుంది’ అని అన్నాడు. సాయి రామ్ చివరిగా నటించిన సినిమా తేజ సినిమా ‘1000 అబద్దాలు’. ప్రస్తుతం తను రెండు కొత్త సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.