తొలి సినిమా ‘రేయ్’తో సయామీ ఖేర్ స్టార్ హీరోయిన్ అవుతుంది : వైవీఎస్

తొలి సినిమా ‘రేయ్’తో సయామీ ఖేర్ స్టార్ హీరోయిన్ అవుతుంది : వైవీఎస్

Published on Feb 5, 2013 12:30 PM IST

YVS-Saiyami

కే. రాఘవేంద్ర రావు తరువాత కథానాయికలని అందంగా చూపిస్తాడని వైవీఎస్ చౌదరికి బాగా పేరుంది. ఆయన దేవదాసు సినిమాతో ఇలియానాని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరో హీరోయిన్ ని కూడా ఆయన పరిచయం చేయబోతున్నారు. సీనియర్ నటి షబానా అజ్మీ మేనకోడలు సయామీ ఖేర్ ని రేయ్ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. వైవీఎస్ డైరెక్షన్ తో పాటుగా నిర్మాత కూడా ఆయనే.

తాజా వార్తలు