
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” కూడా ఒకటి. ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి నెక్స్ట్ సాంగ్ గా శశిరేఖ అనే పాటని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ నుంచి మేకర్స్ ఇప్పుడు ప్రోమోని అయితే వదిలారు.
మరి ఈ ప్రోమో కూడా మంచి ప్రామిసింగ్ గానే ఉంది. చిరంజీవి నయన్ లపై ఒక రొమాంటిక్ కపుల్ డ్యూయెట్ లా ఇది కనిపిస్తుంది. అలాగే భీమ్స్ మరోసారి మంచి బీట్స్ ని అందించాడు. ఇక ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ఈ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతుంది. ఇక అదెలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాకి షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తుండగా వెంకీ మామ కూడా కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.