ఇండియన్ స్మాల్ స్క్రీన్ దగ్గర సూపర్ హిట్ అయ్యిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. అయితే ఎన్నో భాషల్లో ప్రసారం అవుతున్న ఈ టెలివిజన్ సిరీస్ తెలుగులో పెద్ద సక్సెస్ అయ్యి అత్యధిక రేటింగ్స్ తో దూసుకెళ్తుంది. ఇలా తెలుగులో అక్కినేని నాగార్జున ఈ షో హోస్ట్ గా వచ్చిన తర్వాత నుంచి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ దీనికి తోడై మరింత బెటర్ రెస్పాన్స్ అందుకుంది. ఇలా సీజన్ 3 నుంచి ఇపుడు తానే వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు.
అయితే బిగ్ బాస్ షోకి తాను హోస్ట్ గా చేయడం మొదలు పెట్టాక తన పాత స్టేట్మెంట్ ఒకటి వైరల్ గా మారి తనపై కొంచెం నెగిటివ్ గా మారాయి. అయితే దీనిపైనే కింగ్ నాగ్ లేటెస్ట్ గా ఓ క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను మొదట్లో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేయను అని చెప్పింది నిజమే అని కానీ ఒక్కసారి ఇందులోకి అడుగు పెట్టాక అదొక వ్యసనంగా మారింది అని లేటెస్ట్ హాట్ స్టార్ ఈవెంట్ లో తెలిపారు. సో తన పాత స్టేట్మెంట్ పై ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.
