నిశ్చితార్థంతోనే రిలేషన్‌ను ముగించిన హీరోయిన్.. ఎవరంటే?

Nivetha Pethuraj

టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. అయితే, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగినట్టు కొన్ని నెలల క్రితం అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు వీరు తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన నిశ్చితార్థ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించడంతో పాటు వీరిద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి రద్దు పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఇద్దరి నుండి ఎలాంటి అధికారిక స్టేట్మెంట్ రాలేదు.

ఇక నివేదా పేతురాజ్ ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, దీనికి సంబంధించిన అసలు కారణం మాత్రం బయటకు రావాల్సి ఉంది.

Exit mobile version