“సర్కారు వారి పాట” మేకర్స్ కీ డెసిషన్?


ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటించడానికి సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల అనంతరం మొదలు పెట్టిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. అయితే వచ్చే నవంబర్ లో షూట్ మొదలు కానున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొంత కాలం నుంచి ఓ బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ ను అనుకుంటున్నారని టాక్ వినిపించింది. మేకర్స్ కూడా ముందు అలాగే అనుకున్నారని టాక్ వినిపించినప్పటికీ వీరు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని భావిస్తున్నారట. ఇపుడు కీర్తి స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ పేరును వారు పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఆమె స్థానంలో మహేష్ సరసన ఎవరు కనిపిస్తారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు మరి.

Exit mobile version