“సర్కారు వారి పాట” కీలక షూట్ అక్కడే ఎందుకంటే.?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ స్పెషల్ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అయితే అన్ని సినిమాల్లానే ఈ చిత్రానికి కూడా కరోనా పెద్ద బ్రేక్ నే ఇచ్చింది.

కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం షూట్ కు జనవరిలో ముహూర్తం కుదిరింది. మొదట యూఎస్ లో షెడ్యూల్ ను పూర్తి చేద్దామనుకున్నారు కానీ అక్కడి పరిస్థితుల రీత్యా ఇక్కడికి షిఫ్ట్ చేసారు. మరి ఆ షెడ్యూల్ ను మార్చ్ లోకి షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినిమాకు చాలా కీలకమైనటువంటి ఎపిసోడ్స్ ను జార్జియా మరియు మియామి ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో మహేష్ రెండు భిన్నమైన షేడ్స్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్యూయల్ రోల్ అన్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అందులో ఒకదాన్ని అక్కడ ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version