మే 5న ‘సరదాగా అమ్మాయిలతో’ ఆడియో విడుదల

మే 5న ‘సరదాగా అమ్మాయిలతో’ ఆడియో విడుదల

Published on May 4, 2013 4:35 PM IST

Saradaga-Ammayilatho

వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న’సరదాగా అమ్మాయిలతో’ సినిమా ఆడియోని మే 5న హైదరాబాద్లో లంచ్ చేయనున్నారు. భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మిస్తున్నాడు. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ లు ఇంతకూ ముందు ‘ఏమైందో ఈ వేల’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాదించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘సరదాగా అమ్మాయిలతో’ సినిమాలో సుమన్, విశ్వనాధ్, అలీ, ముమైత్ ఖాన్, లు నటిస్తున్నారు. ఈ సంవత్సరం వీరిద్దరికీ చాలా ముఖ్యమైనది. వరుణ్ సందేశ్ నటించిన ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ సినిమాలో, అలాగే నిషా అగర్వాల్ నటించిన ‘సుకుమారుడు’ సినిమాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలకు సిద్దమవుతున్నాయి.

తాజా వార్తలు