వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘సరదాగా అమ్మాయిలతో’ సినిమా కాస్త ఆలస్యంగా విడుదలకానుంది . ఈ సినిమా పత్తికొండ కుమారస్వామి నిర్మాణంలో భాను శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమా రెండో ద్వితీతార్ధంలో ఛార్మీ ఒక ముఖ్యపాత్రలో కనిపించనుంది. “ఈ సినిమా జస్ట్ ఫ్రెండ్స్ గా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయిల మధ్య ఎదురైనా సంఘటనల నడుమ తీసిన కధ. వరుణ్, నిషా తమ పాత్రలకు న్యాయం చేసారని” దర్శకుడు తెలిపాడు. రవి వర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. వరణ్ మరియు నిషా ఇదివరకే సంపత్ నంది తీసిన ‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. వారిద్దరి కెమిస్ట్రీ మరోసారి వర్కౌట్ అవుతుందేమో చూద్దాం