విక్రాంత్ రెడ్డి, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్లో హీరోహీరోయిన్ మధ్య ఏర్పడే ప్రేమ కష్టాలు.. వాటిని పరిష్కరించేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.. ఈ మధ్యలో వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి.. అనే అంశాలను టచ్ చేస్తూ మేకర్స్ కట్ చేశారు. అయితే హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో కథలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ సినిమాలో మనకు చూపెట్టబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
సీరియస్ విషయాన్ని కామెడీ టచ్‌తో మనముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించబోతున్నారు. సంజీవ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


