గ్లోబ్ ట్రాటర్ కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా నిజమేనా?

గ్లోబ్ ట్రాటర్ కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా నిజమేనా?

Published on Nov 6, 2025 10:00 AM IST

SSMB29

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ అప్డేట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో రానున్న భారీ ప్రాజెక్ట్ కోసమే అని చెప్పాలి. ఎంతో కాలంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్ డే కి సంబంధించి ఇచ్చిన ఓ క్రేజీ అనౌన్స్మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

మరి ఈ వీడియోలో మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ వరుసగా చూపించి అందరి హీరోల ఫ్యాన్స్ లో మంచి ఊపుని తెప్పించారు. అయితే ఈ భారీ సినిమా గ్రాండ్ లాంచ్ కోసం ఈ టాప్ స్టార్స్ అంతా హాజరవుతారా? అనే టాక్ ఇపుడు వినిపిస్తోంది. అయితే ఇది అసాధ్యం కాదు అని చెప్పదనికి కూడా లేదు.

అక్కడ మహేష్ బాబు పైగా రాజమౌళి ప్లాన్ చేస్తే ఏదైనా జరుగుతుంది. ఒకవేళ ఈ అందరి బిగ్ స్టార్స్ సమక్షంలో ఈ సినిమా ఈవెంట్ గాని జరిగితే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీ లోనే నిలిచిపోయే లాంచ్ ఈవెంట్ అవుతుంది అని చెప్పవచ్చు. మరి ఈ సెన్సేషనల్ బజ్ వెనుక నిజం ఉందా లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు