విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ పండుగ ఎంటర్టైనర్ చిత్రమే “సంక్రాంతికి వస్తున్నాం”. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఒక సంచలనంగా మారింది అని చెప్పాలి. నెవర్ బిఫోర్ బుకింగ్స్ తో అనూహ్య స్పందన ఈ చిత్రం అందుకోగా భారీ వసూళ్లుతో రికార్డులు సెట్ చేస్తుంది.
అయితే ఎంత పెద్ద సినిమా అయినా కూడా దాని రిజల్ట్ జెనరల్ ఆడియెన్స్ లో నార్మల్ ఆడియెన్స్ లో సమానంగానే ఉంటుంది అనే రేంజ్ లో సంక్రాంతికి వస్తున్నాం రన్ ఇపుడు ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. ఇలా డే 5 కి సంక్రాంతికి వస్తున్నాం తెలుగు స్టేట్స్ లో ఏకంగా నాన్ RRR రికార్డు సెట్ చేయడం విశేషంగా మారింది.
RRR సినిమాకి ఐదో రోజున 13 కోట్లకి పైగా షేర్ వస్తే దాని తర్వాత ఆల్ టైం టాప్ 2 స్థానంలో 12 కోట్లకి పైగా షేర్ తో టాప్ 2 లో నిలిచినట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో సంచలన రికార్డుని ఈ చిత్రం సొంతం చేసుకుంది అని చెప్పాలి. మరి మున్ముందు సంక్రాంతికి వస్తున్నాం రన్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే.