‘సంక్రాంతికి వస్తున్నాం’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. రోజురోజుకు ఈ చిత్రం అనూహ్యంగా మంచి కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం వసూళ్ల సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ల డీటెయిల్స్ బయటకు వచ్చాయి. నైజాం ఏరియాలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 12వ రోజు నైజాంలో ఈ చిత్రం సంచలనం సృష్టించింది, శనివారం రూ. 3.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, ఈ రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

మొత్తానికి 12 రోజుల ముగిసే సమయానికి ఈ చిత్రం రూ. 260 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసింది. మొత్తమ్మీద బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మొదటి నుంచి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించారు. మొత్తానికి బలమైన ప్రమోషన్ల కారణంగా, ప్రేక్షకుల్లో ఈ సినిమా దూసుకువెళ్తుంది. మరి రానున్న రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.

Exit mobile version