త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ దత్ రోల్ ?

త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ దత్ రోల్ ?

Published on May 11, 2020 8:55 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాస్తున్నాడట. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని, ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నవంబర్ నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 దసరాకి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు