హీరోగారికి ఆ లక్షణాలున్న అమ్మాయి కావాలట.

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా ఉన్న సందీప్ కిషన్ వయసు ప్రస్తుతం 33. టాలీవుడ్ బ్యాచిలర్స్ లో ఒకరిగా ఉన్న సందీప్ పెళ్లి గురించి అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు. సందీప్ గత మూడేళ్ళుగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఓ మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాడని చెప్పారు. అలాగే తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే స్మార్ట్, స్ట్రాంగ్ మరియు స్ఫూర్తిని ఇచ్చే అమ్మాయి అయి ఉండాలని చెప్పారు. మరి ఆ లక్షణాలున్న అమ్మాయి సందీప్ దొరకాలని ఆశిద్దాం.

గత ఏడాది రామకృష్ణ తెనాలి బి ఏ బి ఎల్ సినిమాతో నవ్వులు పంచిన సందీప్ ప్రస్తుతం ‘ఏ వన్ ఎక్స్ ప్రెస్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version