‘అర్జున్ రెడ్డి’ అనే ఒక్క సినిమాతో నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకుని తనకంటూ సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. నిజానికి హిందీలో అంతకు ముందే ‘కబీర్ సింగ్’ లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అయినా ఈ రీమేక్ సినిమా అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సందీప్ హిందీలో కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
కాగా సందీప్ తన తరువాత సినిమాని రణబీర్ కపూర్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రణబీర్ కపూర్ కి కథ కూడా చెప్పాడట. రణబీర్ కపూర్ కూడా సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాకి సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుబోతున్నాడు. మరి పాన్ ఇండియా సినిమా.. పైగా స్టార్ హీరో.. అన్నిటికి మించి మినిమమ్ గ్యారెంటీ మూవీ. అందుకే ప్రణయ్ ఈ సినిమా నిర్మాణం పై ఆసక్తిగా ఉన్నాడట.