రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ వచ్చే వారం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్.
ఈ క్రమంలో ఓ సెన్సేషనల్ ఇంటర్వ్యూని మనముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి లను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఇంటర్వ్యూతో కింగ్డమ్ బాయ్స్ ఫైర్ పుట్టించేందుకు సిద్ధమయ్యారని వారు క్యాప్షన్ ఇస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూని త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు