లీగల్ గా చర్యలు తీసుకోబోతున్న సన ఖాన్

లీగల్ గా చర్యలు తీసుకోబోతున్న సన ఖాన్

Published on May 5, 2012 10:49 AM IST


వ్యబిచారం కేసు లో అరెస్ట్ అయినట్టు సన ఖాన్ మీద పలు ఛానల్ మరియు వెబ్ సైట్స్ కథనాలు ప్రచురించాయి. రెండు రోజుల క్రితం అదే పేరు కల మరో నటి బెంగళూరులో వ్యభిచారం నేరం కింద అరెస్ట్ అయ్యారు ఈ వివాదం లో కి సన ఖాన్ పేరుని అనవసరంగా తీసుకొచ్చారు. దీని మీద ప్రముఖ పత్రికతో తన స్పందన తెలియజేస్తూ ఇలాంటి నిరాధారమయిన వార్తలను ఎలా ప్రచురిస్తారు అంటూ విరుచుకుపడ్డారు. ఇలా ఆధారం లేని వార్తలను ప్రచురించినందుకు ఒక న్యూస్ ఛానల్ మరియు కొన్ని వెబ్ సైట్స్ మీద న్యాయపరమయిన చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారు. విలేఖరుల సమావేశం పేటి అందులో అరెస్ట్ అయ్యింది తను కాదు అని చెబుతానని కూడా చెప్పారు. ఈ విషయం అందరికి తెలియాలి. సన ఖాన్ కి మంచి జరగాలి అని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు