క్రాక్ విలన్ భయపెడుతున్నాడుగా..!

క్రాక్ విలన్ భయపెడుతున్నాడుగా..!

Published on Apr 26, 2020 8:59 PM IST

క్రాక్ మూవీ నుండి నటుడు సముద్ర ఖని లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని కటారిగా సముద్ర ఖనిని పరిచయం చేశారు. దీనితో క్రాక్ లో సముద్ర ఖని కఠారి గా భయపెట్టనున్నాడని అర్థం అవుతుంది. మాస్ విలన్ లుక్ ఆయనకి బాగా సెట్ అయ్యింది. ఇక ఈ మూవీలో మరో ప్రధాన విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తున్నారు. ఇటీవలే ఆమె లుక్ కూడా విడుదల చేయడం జరిగింది.

దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవితేజ-గోపీచంద్ లది హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో రవితేజ్ మరో మారు పోలీస్ రోల్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు