బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో సంచలన చిత్రంతో రానున్నాడు. ఆయన ఈసారి ఏకంగా ఇంటర్నేషన్ బర్నింగ్ ఇష్యు పై కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన కొత్త చిత్రం కరోనా వైరస్ గురించిన సబ్జెక్టు తో తెరకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పష్టమైన ఇన్ఫర్మేషన్ లేకున్నప్పటికీ పోస్టర్స్ చూస్తుంటే అలా తోస్తుంది. ఇక కరోనా వైరస్ పుట్టిన ఉహాన్ నగరంలో షూటింగ్ జరుపుకున్న చివరి చిత్రంగా దీన్ని చెవుతున్నారు. నేడు సంపూర్ణేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు.
బ్లాక్ అండ్ బ్లాక్ లో సంపూర్ణేష్ బాబు హాలీవుడ్ హీరో లుక్స్ లో ఉన్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించాల్సివుంది. గతంలో ఆయనతో హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు తీసిన నిర్మాతలు ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు నోలాన్ మౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, జులై 30న విడుదల కానుంది.