రాజమౌళి, సుకుమార్ ల తరువాత సంపత్ నంది కూడా నిర్మాతగా మారనున్నాడు. ఈ ఏడాది చివర్లో నవీన్ అనే దర్శకుడిని పరిచయం చేయనున్నాడు. ఆది, ఎరికా ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రధారులు. ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు
ఇదిలావుంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది గబ్బర్ సింగ్ 2 సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం ఈనెలలోనే హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది. మే నుండి ఈ సినిమా మొదలుకావచ్చు. పవన్ కళ్యాణే స్వయంగా స్క్రిప్ట్ వ్యవహారాలు చుస్కుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శరత్ మరార్ నిర్మాత
ఈ సినిమాలో హీరోయిన్ స్థానం ఇంకా భర్తీ కాలేదు. ప్రధాన తారాగణం యొక్క వివరాలు త్వరలోనే తెలిపే అవకాశాలు వున్నాయి