లెజెండ్ లో మెరవనున్న సమీరారెడ్డి?

sameera_reddy
బాలకృష్ణ నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం వైజాగ్ ప్రాంతంలో చాలా రోజులుగా సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. బాలకృష్ణ,హీరోకాగా, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే హీరోయిన్స్. కమల్ కామరాజు కూడా నటిస్తున్నాడు

తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో సమీరా రెడ్డి నటించనుంది. గతంలో ఈ భామ రానా, నయనతార నటించిన ‘కృష్ణం వందేజగద్గురుం’ సినిమాలో తలుక్కున మెరిసింది. ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఈ సినిమాను పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు బోయపాటి శ్రీను తీస్తున్నాడు. గోపీచంద్, రామ్ ఆచంట, అనీల్ సుంకర ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమా వచ్చే యేడు మొదట్లో విడుదలవుతుందని అంచనా

Exit mobile version