‘జబర్దస్త్’ కామెడీ చేయనున్న సమంత

samantha

త్వరలో విడుదల కాబోతున్న జబర్దస్త్ సినిమాలో సమంత జబర్దస్త్ కామెడీ చేసిందంట. ఈ వారాంతంలో ఫిబ్రవరి 22న విడుదల కాబోతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి సమంత రొమాంటిక్ కామెడీ పండించిందట. అలా మొదలైంది తరువాత నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో కూడా అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. సమంత క్యారెక్టరైజేషణ్ కొత్తగా ఉంటుందని నందిని రెడ్డి కూడా చెప్పారు. మరో వైపు సిద్ధార్థ్ కూడా సమంత లక్కీ గర్ల్ అంటూ పొగిడేస్తున్నాడు. తమన్ అందించిన ఆడియో ఇప్పటికే మార్కెట్లో హిట్ అయింది. అల్లా అల్లా పాట బాగా ఫేమస్ అయింది. నిత్య మీనన్, శ్రీహరి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ కామెడీ స్పెషల్ అట్రాక్షన్.

Exit mobile version