అందాల భామ సమంత మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమా నుంచి ఇప్పటి వరకూ అన్ని సినిమాల్లోనూ మన పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలనే చేసింది. ఒక్క బృందావనం సినిమాలో మాత్రమే ఆమె కాస్త గ్లామరస్ గా కనిపించింది. సమంత ఇప్పుడు ఆ ఇమేజ్ ని మార్చుకోనుంది. తాజగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వి.వి వినాయక్ డైరెక్షన్లో రానున్న సినిమాలో సమంత అల్ట్రా గ్లామరస్ గా కనిపించనుంది. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా పరిచయం కానున్నాడు.
ఇటీవలే వీరిద్దరి పై ఓ ఫోటోషూట్ చేసారు. ఇది చూసిన కొంతమంది సమంత ఇంతలా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 15న లాంచనంగా ప్రారంభం కానుంది.