బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. రామలక్ష్మితో పెద్ది స్పెషల్ చిందులు..!

peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పెద్ది’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తనదైన మార్క్ టేకింగ్‌తో పరుగులు పెట్టిస్తున్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్‌ను ఇప్పటికే రివీల్ చేశారు. ఇక భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ మాస్ నెంబర్ స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారట. అయితే, ఈ స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో పాటు చిందులు వేసేందుకు చాలా మంది పేర్లు పరిశీలించారట. అయితే, రీసెంట్‌గా ఈ సాంగ్ కోసం యంగ్ బ్యూటీ శ్రీలీల పేరును కూడా పరిశీలించాక.. ఇప్పుడు మరో స్టార్ బ్యూటీకి ఈ ఆఫర్ ఇచ్చేందుకు బుచ్చిబాబు రెడీ అయ్యాడట.

స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ బ్యూటీ సమంతను ఈ స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తున్నారట. ఆమె గతంలో రామ్ చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ చిత్రంలో రామలక్ష్మి అనే పాత్రలో ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌తో అలరించింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్‌లోనూ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. దీంతో ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ కోసం ఆమెతో స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version