ఎంచుకుని మరీ నటిస్తానంటున్న సమంత

samantha

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో వున్న తారలలో సమంత ప్రత్యేకం. లెక్కలేనన్ని ఆఫర్లతో ‘గోల్డెన్ లెగ్’ గా కీర్తింపబడుతూ కెరీర్ లో దూసుకెళ్తుంది.ఎన్నిప్రాజెక్టులు వచ్చినా వాటి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆమెకు చాలా వరకూ ‘బబ్లి గర్ల్’ పాత్రలే వస్తున్నాయి. కాబట్టి సమంత ప్రస్తుతం చాలెంజింగ్ పాత్రలు చేయడానికి ఇష్టపడుతుంది.

“నాకు నచ్చిన నా మనసు మెచ్చిన పాత్ర నాకు ఎదురయ్యేవరకూ మరే సినిమాను అంగీకరించను” అని ట్వీట్ చేసింది. కొత్త దర్శకులతోకలిసి పనిచేసి కధను నడిపించే పాత్రలు చెయ్యాలని కోరికట. ఈ తరం హీరోయిన్లలో టాలెంటెడ్ అయిన సమంతకు ఇటువంటి దర్శకులు త్వరలోనే రావాలని కోరుకుందాం

Exit mobile version