సమంతని థ్రిల్ చేసిన అతని రిప్లై


అప్పుడప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కొందరికి ఆశ్చర్యాలను పంచుతూ ఉంటాయి. ఈరోజు సమంత సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదురుకోంది. పాలో కల్హో ఆమెకి రిప్లై ఇవ్వగానే ఆమె మేఘాల్లో తేలిపోయారు. ఆమె అభిమానించే రచయిత పాలో కల్హో. ఈరోజు పొద్దున్న ట్విట్టర్లో ” మనం ఏం చేస్తున్నామనేది మనం, ఏం చెయ్యాలనుకుంటున్నాం అన్నది కాదు – పాలో కల్హో, అందుకే ఈ రచయితంటే నాకు ఇష్టం” అని సమంత అన్నారు కాసేపటికి ఆమెకి స్వయానా పాలో కల్హో రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ని చూసిన సమంత కాసేపు నమ్మలేకపోయింది ఆ విషయామై పదే పదే చెప్పింది ఈ నటి ఆయనకీ కృతజ్ఞతలు తెలుపుకుంది. పాలో కొల్హో “ది అల్కెమిస్ట్” మరియు “ఎలెవెన్ మినిట్స్” వంటి ప్రముఖ నవలలు రచించిన బ్రెజీలియన్ రచయిత. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత హైదరాబాద్లో నందిని రెడ్డి దర్శకత్వంలో చిత్రం చిత్రీకరణలో పాల్గొంటుంది.

Exit mobile version