దర్శకులు మెచ్చిన నటి ‘ సమంతా ‘


అతి తక్కువ కాలంలోనే చలనచిత్ర రంగంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అందాల భామ’ సమంతా ‘ ఇలా అనడానికి బలమైన కారణాలు ఉన్నాయి. సమంతా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరితో కలిసిపోయి పనిచేసే మనస్తత్వం అలాగే చలనచిత్ర ప్రముఖుల దగ్గర చాలా వినయంతో నడుచుకుంటారు. ఆమె ఒక మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు, అలాగే దర్శకుడు చెప్పే పాత్రలకు అనుగుణంగా మారి నటిస్తుంది. సమంతా తో పనిచేసిన ఎ దర్శకున్ని అడిగినా తన గురించి మంచి నటి అని కితాబులిచ్చారు. సమంతా సినీ అబిమానుల నుంచి, యువత నుంచి మంచి నటిగా ప్రజాదరణ పొందింది. తనకున్న ప్రజాదరణతో తను నటిగా కెరీర్ లో బిజీ గా మారిపోయింది. ఈ సంవత్సరం ఆమె చాలా బారి బడ్జట్ చిత్రాలు వరుసగా రానున్నాయి. ఈ సంవత్సరం రాబోయే కొన్ని చిత్రాలు ‘ ఈగ ‘, ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘, ‘ ఎవడు ‘, ‘ ఆటో నగర్ సూర్య ‘ మరియు ‘ ఎటో వెళ్లిపోయింది మనసు ‘. సమంతా ఈ చిత్రాల ద్వారా ఈ సంవత్సరం అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం.

Exit mobile version