వరుస సినిమా షూటింగ్లతో బిజీ అయిన సమంత ఇప్పుడు కాస్త విరామం కోరుకుంటుంది. పవన్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం ఇంటి వద్ద కాలక్షేపం చేస్తుంది. “బాగా పొడుగైన టి- షర్టులు షాట్ లు వేసుకుని, మామిడి ఒక చేతిలో, రిమోట్ మరో చేతిలో వుంటే అస్సలు బెడ్ పైనుంచి దిగాలనే అనిపించదు కదూ… మీరేమంటారు?? “అని ట్విట్టర్లో అభిమానులను ప్రశ్నించింది.
‘అత్తారింటికి దారేది’ సినిమాకు గాను త్వరలో యూరోప్ వెళ్లనున్న సమంత ఆ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పుర్తిచేసుకోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సరసన ఈ భామతో పాటు ప్రణీత సుభాష్ స్క్రీన్ పంచుకోనుంది. “త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లోతో పని చెయ్యడం నాకు చాల ఇష్టం. వారితో ఉంటే నా నావ్వును ఆపుకోలేను. అందువలనే ఎంత కస్టపడి అయినా చెయ్యాలనిపిస్తుంది. కానీ ప్రతీ నిముషాన్ని అస్వాదిస్తాం… కనుక తప్పకుండా గెలుస్తాం” అని సెలవిచ్చింది. ఈ సినిమా కాకుండా ఈ భామ ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ మరియు లింగుస్వామి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తుంది.