శెలవులు కోరుకుంటున్న సమంత

శెలవులు కోరుకుంటున్న సమంత

Published on Jul 29, 2013 9:00 PM IST

Samantha
సమంత పని ఒత్తిడి నుండి ఉపశమనం కోరుకుంటుంది. ప్రస్తుతం ‘మనం’ సినిమా షూటింగ్ లో ఉన్న ఈ భామ ఆగష్టు 1నుండి ఒక చిన్న విహారయాత్రకు వెళ్లనుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 7న భారీ విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమా విడుదలయ్యే నాటికి యాత్రనుండి తిరిగి రావాలనియోచిస్తుంది. పవన్ కళ్యాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ ఏడాదిలో ఎక్కువ వార్తలలో నిలిచిన సినిమాలలో ఒకటైన ఈ చిత్రంలో త్రివిక్రమ్ చేసే మ్యాజిక్ లో పవన్, సమంత జోడీ ప్రేక్షకులకు కనులవిందును కలిగిస్తుందని నమ్మకంగావున్నారు.

తాజా వార్తలు